జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తా: కేసీఆర్‌

cm-kcr-support-to-jagan-like-a-big-brother-on-godavari-water

ఏపీ సీఎం జగన్ ను పట్టుదల ఉన్న యువనేతగా అభివర్ణించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాయలసీమ  అభివృద్ధి విషయంలో తాను జగన్ కు పెద్దన్నలా వ్యవహరిస్తానని, అన్ని విషయాల్లో సాయంగా ఉంటానని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చిన కేసీఆర్‌.. మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా..రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని.. ఆ నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్ కలిసి పనిచేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.

Latest Updates