స్వరూపనందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్

ఫిల్మ్ నగర్ దైవ సన్నిధిలో విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీని కలిశారు సీఎం కేసీఆర్. స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం…. ఆతరువాత ఏకంతంగా భేటీ అయ్యారు. తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యే దానం, పరుచూరి గోపాల కృష్ణ, ఎంపీ సంతోష్ లను బయటకు పంపించి స్వామీజీతో చర్చించారు. దాదాపు పావుగంట సేపు స్వామీజీతో సంప్రదింపులు జరిపారు సీఎం. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి సీఎం హాజరుకాలేదు.  దీంతో ఇవాళ  స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. జూన్ లో జరిగే పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్ ను స్వామిజీ ఆహ్వానించారు. జూన్ 15నుంచి మూడు రోజులపాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు జరగనున్నాయి.

 

 

Latest Updates