రేపు సొంతూరికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ రేపు తన సొంతూరు చింతమడకకు వెళ్లనున్నారు. దీంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం పది  గంటలకు చింతమడకకు చేరుకోనున్న సీఎం.. సాయంత్రం వరకు చింతమడకలోనే గడపనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి భోజనం చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 5 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రేపు ఇతర గ్రామాల వాళ్లు రాకుండా.. అధికారులు, గ్రామస్తులకు ఐడెంటిటీ కార్డులిస్తున్నారు అధికారులు.

Latest Updates