రేపు జగిత్యాల,జయశంకర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

సీఎం కేసీఆర్ రేపు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షిస్తారు సీఎం. రేపు ఉదయం జగిత్యాల జిల్లా మాల్యాల మండలం.. రాంపూర్ దగ్గర్లోని పంప్ హౌజ్ పనులను చూస్తారు సీఎం కేసీఆర్. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుంటారు. అక్కడి పనులను కూడా పరిశీలించి.. అధికారులతో చర్చిస్తారు.

Latest Updates