యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు  పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ లక్ష్మీనరసింహ స్వామికి ప్ర‌త్యేక  పూజలు నిర్వహించారు. అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థం అందజేశారు. అనంతరం యాదాద్రిలో జరిగే పనులను సీఎం పరిశీలించనున్నారు. సీఎం వెంట మంత్రులు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విప్ గొంగిడి సునీత‌, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఇత‌ర‌ నేత‌లు, అధికారులు ఉన్నారు.

యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. పనుల పురోగతిని సీఎం కేసీఆర్.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి.

Latest Updates