ప్రజా సమస్యలు తెలియని కొడుకును సీఎం ను చేస్తున్నడు

ప్రజా సమస్యలు తెలియని త‌న‌ కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింద‌ని, టీఆర్ఎస్, కాంగ్రెస్ లోపభూయిష్టంగా ఒప్పందం చేసుకున్నాయని ఆమె అన్నారు. టీఆర్ఎస్ కేంద్ర నిధులను పక్క దారి పట్టిస్తోందని.. కేసీఆర్ ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతున్నాడ‌ని అన్నారు.

2023 లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ పార్టీ కి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు ,తెలంగాణ అకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కి బుద్ది చెప్పడానికే ప్రజలు తమ పార్టీలో చేరుతున్నారని ఆమె అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో బీజేపీ కి తిరుగులేదని, బీజేపీ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.

Latest Updates