ప్రధాని మోడీతో భేటీ కానున్న కేసీఆర్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. ముందుగా అనుకున్న సమయంలో మార్పు జరిగింది. ఉదయం 11. 30 గంటలకు జరగాల్సిన భేటీ అనివార్య కారణాల వల్ల సాయంత్రం 4.30 గంటలకు మారింది. సీఎం గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట ఎంపీలు కేకే, నామా తదితరులు ఉన్నారు. మోడీతో జరిగే భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రేపు ప్రధానితో జగన్​ భేటీ

ఏపీ సీఎం జగన్ సైతం ప్రధాని భేటీ కానున్నారు. శనివారం మధ్యాహ్నం మోడీ, జగన్  భేటీకి ముహూర్తం ఖరారైనట్లు ఏపీ సీఎంవో వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం 11.30 గంటలకు జగన్ ఢిల్లీకి  చేరుకుంటారు.

Latest Updates