ఆదివారం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

ఆల‌య నిర్మాణ పనులపై సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. సీఎం ఆదివారం యాదాద్రిని దర్శించనున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆల‌య నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వ‌హిస్తున్న సీఎం యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. మరోవైపు ఆలయ పనులకు సంబంధించిన నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆలయ పనుల్లో అధికారులకు సలహాలు, సూచనలు చేయనున్నారు.

Latest Updates