CM కుమార మంత్రివర్గ సమావేశం

మధ్యాహ్నం గవర్నర్ ను కలిసే అవకాశం

బెంగళూరులో రాజకీయ గందరగోళం తీవ్రస్థాయికి చేరింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఈ సాయంత్రంలోపు స్పీకర్ ను కలవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో రాజకీయం … ముంబై, ఢిల్లీ నుంచి… ఇపుడు బెంగళూరుకు షిఫ్టవుతోంది. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు సుధాకర్, MTB నాగరాజులు రాజీనామా చేశారు. మరోవైపు… కాంగ్రెస్ -జేడీఎస్ శిబిరంలో రాజీనామాలు బీజేపీకి కలిసొస్తాయన్న అంచనాలు రాజకీయ ఆసక్తి పెంచుతున్నాయి.

ఈ ఉదయం 11గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కుమారస్వామి. మంత్రులతో తాజా పరిణామాలపై చర్చించారు. గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా కుమారస్వామి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ తర్వాత నేరుగా గవర్నర్ ను కలవనున్నారు కుమారస్వామి.

 

Latest Updates