మోడీకి ఓటేసి.. సాయం నన్నడుగుతారేంటి

కర్ణాటక సీఎం కుమారస్వామి ఓ గ్రామ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు దారికి అడ్డు తొలుగుతారా…లేక లాఠీ చార్జీ చేయించాలా అంటూ బెరించారు. ఈ ఘటన రాయచూర్ లో జరిగింది.

గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామి గ్రామాల్లో బస పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా ఇవాళ రాయచూర్‌ నుంచి కర్రెగుడ్డకు వెళ్తున్నారు. ఆ సమయంలో కొందరు జనాలు ఆయన బస్సును అడ్డగించి.. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. జనాల చర్యలతో అసహనానికి గురైన కుమారస్వామి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మోడీకి ఓటేసి.. నన్ను సాయమడుగుతారేంటి’ అని ప్రశ్నించారు. ‘నేను మీకు మర్యాద ఇస్తున్నాను కాబట్టి ఇంత సేపు కామ్‌గా ఉన్నాను. దారి వదులుతారా లేక లాఠీ చార్జీ చేయాలా’ అంటూ కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఓ ఐదు నిమిషాల పాటు గందరగోళం నెలకొంది. ఈ లోపు పోలీసులు వచ్చి జనాలను చెదరగొట్టడంతో.. కుమారస్వామి అ‍క్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ స్థానిక వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు సీఎం తీరు పట్ల మండిపడుతున్నాయి.

Latest Updates