బెంగాల్‌లో మరో 7 రోజుల లాక్‌డౌన్.. అవసరమైతే పొడిగింపు..

బెంగాల్‌లో మరో 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రంలోని కంటెయిన్ మెంట్ జోన్లలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని ఆమె తెలిపారు. ఆ తర్వాత కూడా అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగిస్తామని ఆమె తెలిపారు. సౌత్ 24 పరగనాస్ జిల్లాకు కొత్త కంటెయిన్ మెంట్ జోన్లను ఆమె తిరస్కరించారు. ఎందుకంటే ఆ జాబితాలో చాలా ప్రాంతాలు అనవసరంగా చేర్చారని ఆమె అభిప్రాయపడ్డారు.

‘మీరు సౌత్ 24 పరగనాస్ మొత్తం జిల్లాను లాక్డౌన్ చేయలేరు. ఈ జాబితాను ఎవరు సిద్ధం చేశారు? ఓటర్ల జాబితా ఆధారంగా ఇది జరిగిందా? మీరు మొత్తం వార్డులను చేర్చారు. ఇది చాలా అనవసరం. మరోసారి అధికారులు దీనిపై సమీక్షించండి!’ అని చెప్పారు.

కోల్‌కతా, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాలలను కంటెయిన్ మెంట్ జోన్లుగా మార్చడానికి సీఎం ఒప్పుకున్నారు. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురితో పాటు మాల్డాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. వాటిపై కూడా దృష్టి పెట్టాలని ఆమె అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుండి కోల్‌కతా, హౌరా మరియు ఉత్తర 24 పరగణాలలో లాక్డౌన్ అమల్లోకి వస్తుందని.. మరియు దక్షిణ 24 పరగణాలలో ఎటువంటి లాక్డౌన్ ఉండదని ఆమె తెలిపారు.

‘రాష్ట్రంలో మాస్కుల వాడకాన్ని కఠినం చేయాలని పోలీసులు కోరుతున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటినుంచి పోలీసులు మాస్కులు ధరించని వారిని ఎటూ వెళ్లకుండా తిరిగి ఇంటికే పంపిస్తారు. అలా అయినా ప్రజలు మాస్కులు ధరిస్తారని భావిస్తున్నాను’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 1 నుండి బెంగాల్ లో 5,278 కేసులు నమోదుకాగా.. 136 మరణాలు సంభవించాయి.

For More News..

నీరవ్ మోడీకి చెందిన రూ. 330 కోట్ల ఆస్తులు జప్తు

శ్వాస ఇబ్బందితో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటి

11 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న యువతి స్విమ్మింగ్ పూల్ వీడియో

Latest Updates