నిజం నిరూపిస్తే 100 గుంజీలు తీస్తా: మమతా బెనార్జీ

ఈ ఏడాది బెంగాల్‌లో దుర్గపూజ నిర్వహించబోవడం లేదని జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వం ప్రకటించిందని నిరూపిస్తే ప్రజల ముందు ‘వంద గుంజీలు’ తీయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దుర్గా పూజా విషయంలో రాజకీయ పార్టీ రకరకాలైన అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయంపై తాము ఎలాంటి సమావేశమూ పెట్టలేదన్నారు. ఈ ఏడాది దుర్గా పూజను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించామని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మమతా బెనర్జీ .ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించాలని పోలీసులను సీఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె ఫైర్ అయ్యారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates