ఢిల్లీ అల్లర్ల వెనుక పక్కా ప్లాన్

ప్లాన్ ప్రకారమే ఢిల్లీలో అల్లర్లు

వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఆరోపణ

కోల్‌కతా: ఢిల్లీ అల్లర్ల వెనుక పక్కా ప్లాన్ ఉందని వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఆరోపించారు. దేశమంతటా గుజరాత్ తరహా అల్లర్లకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. సోమవారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. “ఢిల్లీలో జరిగిన అల్లర్లలో అమాయకులను చంపడం బాధించింది. ఇది ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇది మారణహోమమే, అల్లర్లుగా ప్రొజెక్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్రం ఆధీనంలోనే ఉంటారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ ఉన్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు” అని ఆరోపించారు. ఆదివారం కోల్‌కతాలో అమిత్ షా సభలో గోలీమారో నినాదాలను మమత ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని అన్నారు. బెంగాల్‌లో లా అండ్ ఆర్డర్ పై మాట్లాడే అమిత్ షా.. ఇతరులకు లెక్చర్ ఇచ్చే ముందు ఢిల్లీలో జరిగిన అల్లర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో అల్లర్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేయాలని, బాధితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

For More News..

జూపల్లిని పట్టించుకోని కేటీఆర్.. ఇది రెండోసారి

రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!

Latest Updates