కిరణ్ బేడీని రీకాల్ చేయండి: పుదుచ్చేరి సీఎం నిరసన దీక్ష

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి బుధవారం మధ్యాహ్నం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం రాజ్ నివాస్ ఎదుట నిరసన దీక్షకు దిగారు. నల్ల చొక్కా, నల్ల పంచె కట్టుకుని దీక్ష చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయనీయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధనల అమలు విషయంలో బేడీ జోక్యంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్న కిరణ్ బేడీని రీకాల్ చేయాలని సీఎం నారాయణ స్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

మధ్యాహ్నం నుంచి చేస్తున్న నిరసన దీక్షను నారాయణ స్వామి రాత్రి కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఆయనతో పాటు దీక్షలు ఐదుగురు మంత్రులు, కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

Latest Updates