ఇంటర్ లో ఫెయిల్ : సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య

TDP ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లో గురువారం రాత్రి భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారాం. వెంటనే ఆయన్ను హాస్పిటల్ లో చేర్పించినా ఫలితం దక్కలేదని..  ధర్మారాం చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

ధర్మారాం భవనం పైనుంచి కిందకు దూకడంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇంటర్మీడియట్ లో సబ్జెక్టు తప్పినందుకు మనస్తాపంతో ఉన్నాడని పోలీసులు వివరించారు. పరీక్షలో ఫెయిలైన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా ధ్రువీకరించారు పోలీసులు.

ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు వివరించారు. హైదరాబాద్ నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఇటీవలే రాశాడు ధర్మారాం. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో… మాథమేటిక్స్ లో 17 మార్కులే రావడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. శ్రీనగర్ కాలనీలో ఉండే ధర్మారాం… ఏడంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకాడు. కుటుంబసభ్యులు ధర్మారాం ను హాస్పిటల్ లో చేర్చారు.

Latest Updates