ఫ్యూచర్ సిటీగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి  

ఫ్యూచర్ సిటీగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి  

హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణే మా ప్రధాన ఎజెండాగా విదేశీ పర్యటన సక్సెస్ ఫుల్ గా జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనలో రూ. 31వేల 500 కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేం కొత్త సిటీని నిర్మించాలని భావిస్తున్నాం.. ఫ్యూచర్ సిటీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కాగ్నిజెంట్ కూడా ఫ్యూచర్ సిటీలో సంస్థ ను నెలకొల్పాలని అన్నారు. ప్రభుత్వాలు మారినా పని విధానం మారలేదు.. నా  పోటీ ఏపీ, తమిళనాడుతో కాదు.. నా పోటీ ప్రపంచంతోనే అని చెప్పారు.రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభ జిం చి అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

తెలంగాణ ఫ్యూచర్ సిటీగా మారనుంది..అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ ముఖచిత్రంలో నిలబెడతామని చెప్పారు. బుధవారం ఆగస్టు 14, 2024 హైదరాబాద్ లోని కోకాపేట్లో  కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభించారు. కాగ్నిజెంట్ కు మేం వంద శాతం సపోర్ట్ చేస్తామన్నారు. ఆగస్టు5న న్యూజెర్సీలో కాగ్నిజెంట్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. 

ఆగస్టు5న న్యూజెర్సీలో కాగ్నిజెంట్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రతి రంగంలో హైదరాబాద్ రాణిస్తోంది.. తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలిచ్చిన రెండో సంస్థ కాగ్నిజెంట్ అన్నారు. 

ప్రపంచ అవసరాలను తీర్చేందుకు ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. భద్రత, లాభం ఉంటుంది.. పెట్టబడులు పెట్టేవారిని మా ప్రభు త్వం రక్షణ ఇస్తుంది హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.