యాక్షన్ ప్లాన్, ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్ష

మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్ లతో కాసేపట్లో  క్యాంప్ ఆఫీసులో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. గ్రామాల అభివృద్ధికి చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలు తీరును తెలుసుకోనున్నారు.  హరితహారం, పారిశుద్ధ్య పనులు, గుంతలు పూడ్చడం, శ్మశానవాటికల నిర్మాణం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటు, దోమల నివారణ వంటి పనులపై  ఆరా తీయనున్నారు కేసీఆర్.

గ్రామాల అభివృద్ధితో పాటు  భవిష్యత్తులో చేయాల్సిన పనులపై చర్చించనున్నారు. కలెక్టర్ల మీటింగ్ కు డీపీవో, డీఎల్పీవోలనూ ఆహ్వానించారు. మీటింగ్ కోసం కలెక్టర్లు హైదరాబాద్ రావడంతో జిల్లాల్లో కలెక్టర్ల బాధ్యతలు జేసీలు, డీఆర్వోలు నిర్వర్తించాలని సీఎస్ ఎస్ కే జోషి ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates