సాగులో శాఖల విలీనం: వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష

రాష్ట్రం లో ప్రజలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా అధికార వ్యవస్థల పునర్వ్యవస్థీకరణకుచర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాలు వంటి శాఖలు వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండాల్సిన అవసరముం దని చెప్పారు.రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి తెస్తున్నామని, దాం తో పంటల దిగుబడులు పెరుగుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. పెరిగే దిగుబడులకు అనుగుణంగా మద్దతు ధర కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని, ఆ దిశగా తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

క్రాప్‌ కాలనీల ఏర్పాటు చేద్దాం…

రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు, పంటల ఉత్పత్తి , వినియోగం, ఎగుమతులు వంటి వివరాలతో కచ్చితమైన గణాంకా లు రూపొందిం చాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎటువంటి పంటలు లాభదాయకమన్న దానిని రైతులే నిర్ణయించుకునే పరిస్థితులు ఉండాలని చెప్పా రు. దీనిపై వ్యవసాయ శాఖ పది రోజుల్లో క్షేత్రస్థాయి సర్వే జరిపి సమగ్ర సమాచారం సేకరించాలని సూచించారు. కచ్చితమైన అంచనాలతో క్రాప్ కా లనీలు ఏర్పాటు చేయాలని చెప్పా .

మార్కెటింగ్‌ శాఖే కొనాలే….

రైతుల నుంచి నేరుగా మార్కెటిం గ్ శాఖ కొనుగోళ్లు జరపాలని, నిధుల సేకరణ కోసం ఆ శాఖ డైరెక్టరేట్ కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. మార్కె ట్లో తూకం వేసిన ఐదు నిమిషాల్లోనే రైతులకు చెక్కు ఇచ్చే పద్ధతి తీసుకురావాలన్నారు. మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లతో పోటీ పెరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించి న కనీస మద్దతు ధర కంటే తక్కువకు ఎవరూ సరుకులు కొనకుండాచూడాలని చెప్పారు. దేశ వి దేశాల్లో మార్కె ట్ పోటీదారులను గుర్తించి , వారిని ఎదుర్కొనే వ్యూహంరూపొందిం చాలన్నారు.

శాస్త్రీయంగా సాగు ఉండాలె….

రాష్ట్రం లో పంటల సాగు శాస్త్రీయంగా, మార్కెట్‌ పరిస్థితులకు లోబడి ఉండడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. వరి, మక్కలు, పత్తి ఎక్కువగా పండిస్తున్నారని, పండ్ల తోటలున్నాయని చెప్పా రు. ఇతర పంటలను కూడా అక్కడక్కడా పండిస్తున్నారని..అయితే నాణ్యతతో కూడిన ఉత్పాదకత ఉన్నప్పుడే రైతులకు మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. పత్తి దిగుబడి ఎక్కువ వచ్చేలా అనువైన భూముల్లోనే ఆపంటను సాగు చేయించాలని, మేలురకమైన పత్తి సాగు వి ధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా అధ్యయనం చేసి అనుసరించాలని తెలిపారు. పంజాబ్ సహా వరి సా గు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించి , మెలకువలు నేర్చుకోవాలని.. వాటిని రైతులకు నేర్పిం చాలని సూ చించారు. మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉందని, మంచి విత్తనాలు తయారు చేయాలని చెప్పా రు. రోజూ వంటలో వాడే చింతపండుకు కొరత ఉందని, రాష్ట్రంలో విరివిగా చింతచెట్లు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

మహిళా సంఘాలకు ఉపాధి….

పసుపు, మిరపకాయలను పొ డిగా, కందులను పప్పుగా మార్చి అమ్మేలా మహిళా సంఘాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. స్వచ్చమైన పల్లి నూనె, నువ్వుల నూనెలను తయారు చేయడం వల్ల రైతులకు మంచిధర వస్తుందన్నారు. ఇలాంటి వాటితో మహిళలకు ఉపాధి దొరుకుతుందని, వినియోగదారులకు కల్తీ సరుకులు కొనే బాధ తప్పుతుందని చెప్పా రు. నేలల తీరు, అనుకూలమైన పంటలను గుర్తించేలా.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆగ్రానమీ ట్రైనిం గ్ సెం టర్లను పెట్టాలని, యూనివర్సిటీలో ఆగ్రానమీ కన్సల్టెన్సీ ని ఏర్పాటు చేయాలని సూచించారు.

దిగుమతులు తగ్గాలె….

రోజూ వంటల్లో కొత్తిమీర, మెం తి, పుదీనా, జిలకర వేసుకుంటా మని, వాటిని మనం పండించకుండా దిగుమతి చేసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. మామిడి, బత్తాయి, ఇతర పండ్లతో పాటు కూరగాయలను కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చిం దని వ్యాఖ్యానిం చారు. 142 మున్సి పాలిటీల్లో కలిపి రాష్ట్రం లో పట్టణ జనాభా 50 శాతం మేర ఉంటుం దని, వారి అవసరాలకు అనుగుణంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూరగాయలను పండిం చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్క బస్తా బియ్యం బస్తా కూడా రాష్ట్రానికి దిగుమతి కావొద్దని, మనమే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చెయ్యా లన్నారు. అంకాపూర్ రైతుల మాదిరిగా దేశంలో ఏ పంటకు ఎక్కడ మంచి మార్కె ట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా మంచి ధర రాబట్టుకోవాలని చెప్పా రు. తెలంగాణ సోనా రకం బియ్యం షుగర్ ను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారని, అలాం టి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలని సూ చించారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి , ఎంపీ వి నోద్ కుమార్, ఎమ్మెల్యే సండ్ర తదితరులు హాజరయ్యా రు.

Latest Updates