అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్‌

cm-ys-jagan-convoy-clears-rout-for-ambulance

పేషెంట్ ను తీసుకెళుతున్న ఓ అంబులెన్స్‌కు సీఎం జగన్‌ కాన్వాయ్‌ దారిచ్చింది. జగన్‌ తిరుపతి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తిరుపతి బయల్దేరారు జగన్‌. శనివారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు జగన్‌ కాన్వాయ్‌ వెళుతుండగా.. బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఓ ప్రైవేటు అంబులెన్స్‌ అటుగా వచ్చింది. మొదట అంబులెన్స్‌ కు దారి ఇచ్చిన తర్వాత సీఎం జగన్‌ తన కాన్వాయ్‌ ను ముందుకుపోనిచ్చారు.

ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌ కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ వ్యవహరించడం, అంబులెన్స్‌ కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకుసాగడం.. ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న జగన్ మానవీయ హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని దీనిని గమనించిన స్థానికులు తెలిపారు.

Latest Updates