గ్రామాల అభివృద్ధే లక్ష్యం : ZP చైర్మన్లతో కేసీఆర్

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు సీఎం కేసీఆర్. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతో ఉపయోగపడ్డాయని.. ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలన్నారు కేసీఆర్.

కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను సీఎం వారికి వివరించారు.  సమావేశం ప్రారంభానికి ముందు జిల్లా పరిషత్ చైర్మన్లను, వైస్ చైర్మన్ల దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరినీ అభినందించారు. వారందరితో కలిసి భోజనం చేశారు సీఎం కేసీఆర్. నిర్ధేశిత లక్ష్యాలు, గ్రామాల అభివృద్ధికి తోడ్పడిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతి నిధి నుంచి 10 కోట్ల నిధులిస్తామన్నారు సీఎం కేసీఆర్.

Latest Updates