మరో ఎన్నికలకు రంగం సిద్ధం.. నోటిఫికేషన్‌ విడుదల

మరో ఎన్నికలకు రంగం సిద్ధం.. నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.  గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటీస్ జారీ చేస్తారు. 6 నుండి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 10 వరకు గడువు ఇచ్చారు. బరిలో ఉన్న అభ్యర్థులకు అదే రోజు గుర్తులు కేటాయించనున్నారు. 15న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతి మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇందులో 18 లక్షల 42 వేల 412 మంది ఓటర్లున్నారు. సహకార సంఘాల కాల పరిమితి 2018 ఫిబ్రవరిలోనే ముగిసింది. వరుస ఎన్నికల వంటి కారణాలతో ఇప్పటివరకు 4 సార్లు ఇంఛార్జీల పాలనను పొడిగించారు.