ఇయ్యాల్నే సహకార ఎలక్షన్లు

రాష్ట్రవ్యాప్తంగా 747 పీఏసీఎస్​లకు పోలింగ్
157 పీఎసీఎస్​లు, 5,402 డైరెక్టర్‌‌ పదవులు ఏకగ్రీవం
6,248 డైరెక్టర్ పోస్టులకు 14,530 మంది పోటీ
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌‌
వెంటనే లెక్కింపు.. రిజల్ట్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు శనివారం ఎలక్షన్లు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 904 పీఏసీఎస్​లు ఉండగా.. 157 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 747 సంఘాలకు పోలింగ్​ జరగనుంది. ఏకగ్రీవం కాగా మిగిలిన 6,248 డైరెక్టర్​ పదవులకోసం 14,529 మంది క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు. ఒక్కో డైరెక్టర్​ పదవికి సంబంధించి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్  కేంద్రంలో ముగ్గురు ఎన్నికల సిబ్బంది ఉంటారని, ఈ మేరకు 20 వేల మందికి శిక్షణ ఇచ్చామని సహకార శాఖ వర్గాలు వెల్లడించాయి.

వెంటనే కౌంటింగ్.. రిజల్ట్స్

శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.  904 ప్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పరిధిలో 11,653 డైరెక్టర్ స్థానాలకు నోటిఫికేషన్​ జారీచేయగా.. అందులో ఏకంగా 5,402 స్థానాలు (46 శాతం) ఏకగ్రీవమయ్యాయి. వాటన్నింటినీ అధికార పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. మిగతా వాటిలో పోటీ జరుగుతోంది. ఆదివారం ఉదయం పీఎసీఎస్​ల పాలకమండళ్లు కొలువుదీరనున్నాయి.

Latest Updates