బేగంపేట ఫ్లైఓవర్ పై నాగుపాము

హైదరాబాద్‌ బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఫ్లైఓవర్‌పై పామును చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మొదటగా రోడ్డు పక్కన పూలకుండీలో ఉన్న పామును అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు, యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో అది  బుసలు కొడుతూ ఫ్లైఓవర్ పైకి రావడంతో వాహనదారులు భయంతో ఒక్క సారిగా పరులుగు తీశారు.  ఆ తర్వాత ఓ యువకుడు పామును పట్టుకుని పొదల్లో విడిచిపెట్టాడు. పాము రావడంతో ఫ్లైఓవర్‌ కు రెండు వైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Latest Updates