కోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి

పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగింది. కోడి పందేల్లో భాగంగా ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కుడన్న వారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు..  ఆయన అప్పటికే మృతిచెందాడని తెలిపారు.

Cock fight in west Godavari district: one person dead

Latest Updates