సాంబార్ లో బొద్దింక.. హోటల్ సీజ్

ఈసీఐఎల్, వెలుగు: ఇడ్లీ సాంబార్ లో బొద్దింక రావడంతో హోటల్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేసిన ఘటన కాప్రా ఈసీఐఎల్ లో శనివారం జరిగింది. బాధితుడు, జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీ రత్న హోటల్ కు చంద్రమోహన్ అనే వ్యక్తి 9 గంటలకు టిఫిన్ చేయడానికి వెళ్లి ఇడ్లి, వడ ఆర్డర్ చేశాడు. సాంబార్ లో బొద్దింక రావడంతో హోటల్ మేనేజర్ ను ప్రశ్నిం చగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దాంతో బాధితుడు కాప్రా జీహెచ్ ఎంసీ అధికారులకు కంప్లేంట్ చేశాడు. అక్కడికి చేరిన అధికారుల బృందం హోటల్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో కేసు నమోదు చేసి హోటల్ సీజ్ చేశారు.

Latest Updates