యాదాద్రి లడ్డూలో బొద్దింక

యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రసాదంలో బొద్దింక వచ్చింది. శనివారం యాదగిరి గుట్ట పట్టణానికి చెందిన ఓ భక్తుడు స్వామివారిని దర్శించుకుని, లడ్డూ కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పంచుతుండగా ఆ ప్రసాదంలో బొద్దింక బయటపడింది. దీంతో ఆందోళన చెందిన ఆ భక్తుడు ఆలయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.