7000 మంది ఉద్యోగులను తొలగించనున్న కాగ్నిజెంట్?

ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ కార్పొరేషన్ తన సంస్థ నుండి  ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.  సంస్థ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయం సుమారు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. రాబోయే త్రైమాసికాల్లో మొత్తం 7,000 మంది మిడ్-సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.

ఫేస్ బుక్ యొక్క కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్లలో ఒకటైన కాగ్నిజెంట్, దాని కాంట్రాక్ట్ పూర్తయిన తరువాత ఈ కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి తప్పుకోనుంది. ఫేస్ బుక్ కంటెంట్ పై పనిచేసే మోడరేటర్ల యొక్క పని వాతావరణం..మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది.

Cognizant to lay off 7,000 employees, shut content moderation business

Latest Updates