కాగ్నిజెంట్ లో 18000 ఉద్యోగాల కోత…?

కరోనా కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని విధుల నుంచి   తొలగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కాగ్నిజెంట్ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 18,000 మందిని ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలో విఫలమైన వారికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తుందని, అలాంటి వారిని రాజీనామా చేయాలని కోరుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుపై వస్తున్న వార్తలపై కాగ్నిజెంట్  ప్రతినిధులు స్పందించారు. తమ సంస్థ కొంతమంది ఉద్యోగుల్ని తొలగించనుందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని,   ఉద్యోగుల తొలగింపు పై కాగ్నిజెంట్ ఎలాంటి  ప్రకటన చేయలేదని చెప్పారు.

Latest Updates