వరంగల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్

వరంగల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గంలో పార్టీలో నాయకులు ఎక్కువవడంతో కయ్యాలు మొదలయ్యాయి. నలుగురు లీడర్లు నాలుగు గ్రూపులు మెయింటైన్‍ చేస్తున్నారు. బయట కలిసినప్పుడు చిరునవ్వులతో పలకరించుకుంటున్నా.. కాస్త పక్కకు వెళ్లగానే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. రెండు రోజుల కిందట స్థానిక ఎమ్మెల్యే నరేందర్.. మంత్రి ఎర్రబెల్లి తమ్ముడు ప్రదీప్ రావు అనుచరుల మధ్య గొడవ.. రాడ్లు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.

ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‍, బస్వరాజ్‍ సారయ్య, మేయర్‍ గుండా ప్రకాశ్‍రావు, మాజీ ఎంపీ గుండు సుధారాణి తూర్పు నియోజకవర్గం నుంచే రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సోదరుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో తూర్పు నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండగా.. చివరి క్షణంలో హైకమాండ్‍ మాటతో పోటీ నుంచి తప్పుకున్నారు. నరేందర్‍ కోసం త్యాగం చేస్తే.. ఏనాడూ తనను పట్టించుకోలేదని ప్రదీప్‍రావు కోపంతో ఉన్నారు. ఇదే క్రమంలో ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో జరిగిన గొడవతో విభేదాలు మరింత ముదిరాయి. తన వర్గానికి చెందిన కార్యకర్తలపై ఎమ్మెల్యే దాడులకు ప్రోత్సాహిస్తున్నారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు సీరియస్ అయ్యారు.

Latest Updates