సఫారీ బౌలర్ అరుదైన ఘనత : 7 వికెట్లతో వరల్డ్ రికార్డ్

లీసెస్టర్‌: సౌతాఫ్రికా బౌలర్ కొలిన్ అకర్ మన్న్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20 మ్యాచ్ లో 7 వికెట్లు తీసి, వరల్డ్ రికార్డ్ కొట్టాడు. కౌంటీ క్రికెట్ టీ20 లీగ్ లో భాగంగా బుధవారం బర్మిం గ్‌హామ్‌‌ బేర్స్‌ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో లీసెస్టర్‌ షైర్‌ ఫాక్సెస్‌ గెలిచింది. లీసెస్టర్‌ షైర్‌ తరుపున ఆడిన కొలిన్‌ 18 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లతో చెలరేగాడు.దీంతో టీ20 క్రికెట్‌ లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా చరిత్ర సృష్టించాడు. ఇతడికన్నా ముందు 2011లో మలేసియా బౌలర్‌ అరుల్‌ సుప్పయ్య 5 రన్స్ కే 6 వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌ షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది. తర్వాత కొలిన్‌ చెలరేగడంతో బర్మింగ్‌ హామ్‌ 17.4 ఓవర్లలో 134 రన్స్ కే కుప్పకూలింది. కొలిన్‌ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు తీయడంతో బర్మింగ్‌ హామ్‌ ఆఖరి 20 రన్స్ వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

Latest Updates