మైనింగ్ లిఫ్ట్ కూలిపోయి.. 11మంది గని లోపలే

మైనింగ్ లిఫ్ట్ కూలిపోయి.. 11మంది గని లోపలే

రాజస్థాన్ లోని  ఝుంఝును జిల్లాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన కోలిహాన్ గనిలో లిఫ్ట్ కూలిపోవడంతో 14 మంది గనిలోనే చిక్కుకున్నారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరింగింది. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన 11 మందిని గనిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్ కు కట్టిన తాడు తెగిపోవడం వల్ల గనిలోనే లిఫ్ట్ కూలిపోయింది.

ప్రమాదంలో కూలిపోయిన లిఫ్ట్‌లో కోల్‌కతా నుంచి వచ్చిన విజిలెన్స్ టీంతో పాటు గని అధికారులు కూడా ఉన్నారు. గనిలోపల 1,800 అడుగుల లోతులో లిఫ్ట్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ (కెసిసి) యూనిట్ హెడ్ జిడి గుప్తా, కోలిహన్ మైన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎకె శర్మ లిఫ్ట్ లో ఉన్నారు. లోపన ఉన్న వారికి ఏవైనా గాయాలైతే చికిత్స అందించడానికి అధికారులు అంబులెన్స్ లు రెడీగా ఉంచారు. మిగిలిన 11మంది కూడా ప్రాణాలోనే ఉన్నారని డాక్టర్లు సూచిస్తున్నారు. వారిని రక్షించేందుకు జిల్లా అధికారులు, ఎన్డీఆర్ రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి.