ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం విరాళాల సేకరణ

హైదరాబాద్ బాగ్‍అంబర్ పేటకు చెందిన వెంకటనారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వినూత్న పద్ధతిలో విరాళాలు సేకరిస్తున్నాడు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం సహాయం చేయమంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నందున ఖర్చులకు లోన్ కావాలంటూ నల్లకుంటలోని కెనరా బ్యాంకుకు అప్లై చేసుకున్నాడు. రూల్స్ ప్రకారం ఇటువంటి లోన్ ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంక్ వారు తేల్చిచెప్పారు . దీంతో ప్రచార ఖర్చుల కోసం కొత్తగా సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల్లో ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం డబ్బుతో కూడుకున్నవ్యవహారం అని చెప్పాడు. కేవలం డబ్బు,మందు పంపి ణీ చేయడం అర్హతగా మారిందన్నాడు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తానని వివరించాడు.

Latest Updates