కలెక్టర్, జాయింట్​ కలెక్టర్లకు ఫైన్

  • ఓవర్​ స్పీడ్.. పట్టిచ్చిన స్పీడ్​గన్​
  • ఇద్దరి వాహనాలకూ ఫైన్​ వేసిన సూర్యాపేట ట్రాఫిక్​ పోలీసులు
  • కలెక్టర్​కు రూ. 2,305, జాయింట్​కలెక్టర్​కు రూ. 8,680 చలానా

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: ట్రాఫిక్​ రూల్స్​ఉల్లంఘించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, జాయింట్​కలెక్టర్​ వాహనాలకు ట్రాఫిక్​పోలీసులు ఫైన్​వేశారు. జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ టీఎస్​29ఎఫ్​0001 నెంబర్​ఉన్న వాహనాన్ని వాడుతున్నారు. జేసీ సంజీవరెడ్డి టీఎస్​29 7979 నంబర్​ఉన్న వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రెండు వెహికల్స్ ఓవర్​ స్పీడ్​తో ప్రయాణించాయని స్పీడ్‌ లేజర్‌ గన్‌ (కెమెరా) ద్వారా స్పష్టమైంది.  రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ల కిందకు వచ్చే వివిధ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఈ రెండు వాహనాలు స్పీడ్‌ లేజర్‌ గన్‌ కు చిక్కాయి. జిల్లా కలెక్టర్ వాహనం 139 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అలాగే ఖమ్మంలో రాంగ్​ పార్కింగ్​ చేసినట్లూ గుర్తించారు. దీంతో రెండింటికి కలిపి రూ. 2305 జరిమానాను ఈ–చలాన్ ద్వారా విధించారు. ఇక జేసీ ​వాహనం 142 కి.మీ. వేగంతో వెళ్లినట్లు స్పీడ్ గన్ నమోదు చేసింది. మొత్తంగా 8 సార్లు పరిమితికి మించిన వేగంతో ఈ వాహనాన్ని నడిపినట్లు గుర్తించారు. దీంతో 8 ఉల్లంఘనలకు కలిపి మొత్తం రూ. 8680 జరిమానాను విధించారు. అయితే, ఈ చలానా 2017 నుంచే పెండింగ్​లో ఉండటం, ఇప్పటివరకు కట్టకపోవడం  గమనార్హం.

Latest Updates