కలెక్టర్ దేవసేనకు అరుదైన అవకాశం

ఐఏఎస్ అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఎ.దేవసేనకు అరుదైన అవకాశం వచ్చింది. స్వీడన్ దేశ రాజధాని స్టాక్ హోమ్ లో ఆరు రోజుల పాటు జగబోయే వరల్డ్ వాటర్ వీక్ .. ఇంటర్నేషనల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. ఇండియా నుంచి మొత్తం ఐదుగురికి ఆహ్వానం అందింది. అందులో ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అమలులో జాతీయ స్థాయిలో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

గ్లోబల్ వాటర్ ఇష్యూస్ పై ఈ సదస్సులో చర్చిస్తారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్ స్టిట్యూట్- SIWI ఈ సదస్సును నిర్వహిస్తోంది.

Latest Updates