కొత్త జిల్లాలకు వీరే కలెక్టర్లు, ఎస్పీలు

రాష్ట్రంలో శనివారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను నియమించారు సీఎం కేసీఆర్. నారాయణపేట్ జిల్లా కలెక్టర్ గా మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డరాస్ కు.. ములుగు జిల్లా కలెక్టర్ గా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

నారాయణపేట జిల్లా ఎస్పీగా మహబూబ్‌నగర్‌ ఎస్పీ రెమా రాజేశ్వరికి, ములుగు జిల్లా ఎస్పీగా భూపాలపల్లి ఎస్పీ భాస్కరన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ రెండు జిల్లాలను ఏర్పాటుచేయడంతో రాష్ట్రంలో 33 జిల్లాలు అయ్యాయి.

11 మండలాలు నారాయణపేట్ జిల్లాలోకి, 9 మండలాలు ములుగు జిల్లా పరిదిలోకి రానున్నాయి.

నారాయణ్‌పేట జిల్లా పరిధిలోని మండలాలు:  దామరగిద్ద, మాగనూరు, కోస్గి, నారాయణ్‌పేట, మరికల్‌, ఉట్కూర్‌, నర్వ, మద్దూరు, మక్తల్‌, ధన్వాడ కృష్ణా మండలాలు రానున్నాయి.

ములుగు జిల్లా పరిధిలోని మండలాలు: తాడ్వాయి(సమ్మక్క సారక్క)  కన్నాయిగూడెం, వెంకటాపూర్‌, , ఏటూరు నాగారం, ములుగు,  మంగపేట్‌, వెంకటాపురం,గోవిందరావుపేట, వాజేడు.

Latest Updates