కర్నూలు జిల్లాలో ‘గద్దలకొండ గణేష్’ రిలీజ్ ను నిలిపివేసిన కలెక్టర్

కర్నూలు జిల్లాలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన గద్దలకొండ గణేష్ సినిమా రిలీజ్ ను కలెక్టర్ నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తమకు అధికారిక ఆదేశాలు ఇంకా అందలేదనీ, అందుకే సినిమాను ప్రదర్శించడం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో కర్నూలులో ఈ సినిమా ప్రదర్శన ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయమై స్పష్టతరాలేదు.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.ఇవాళ (శుక్రవారం) గద్దలకొండ గణేష్ విడుదలైంది. ఈ సినిమా పేరుపై వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో నిర్మాణ సంస్థ ‘14 రీల్స్’ సినిమా పేరును గద్దలకొండ గణేష్ గా మార్చేసింది.

 

Latest Updates