రేషన్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

రేషన్ బియ్యం సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రేషన్​ షాపుల్లో బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్​లో రేషన్​షాపును సందర్శించారు. బియ్యం పంపిణీని పర్యవేక్షించి రేషన్ కార్డుదారులతో మాట్లాడారు. బియ్యం నాణ్యత గురించి ఆరా తీశారు. ఈ పాస్ డివైస్ లో కొత్తగా వచ్చిన సాప్ట్​వేర్​పని విధానం,సాంకేతిక  ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో రామ్మూర్తి, సివిల్ సప్లై డీఎం ప్రవీణ్ ఉన్నారు.