నాలుగేళ్ల పాపపై అత్యాచారం.. రాజీపడాలని బెదిరింపులు

నాలుగేళ్ల పసిమొగ్గ పై అత్యాచారానికి పాల్పడి, ఆ దారుణంపై నమోదైన కేసుని వెనక్కి తీసుకోవాలంటూ.. చిన్నారి తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తున్నారు ఆ కామాంధుడి తరపు వర్గం. మాదాపూర్‌లోని ఓ కళాశాల మెస్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. ఆ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసింది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న  క్రమంలోనే..  కేసు నుంచి కాంప్రమైజ్ కావాలంటూ చిన్నారి తల్లిదండ్రులపై సదరు కళాశాల సిబ్బంది బెదిరింపులకు దిగారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు  మంగళవారం హబ్సిగూడలోని బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.

Latest Updates