వచ్చే ఏడాది నుంచే కాలేజీలు ప్రారంభం: స్పష్టం చేసిన ఎడ్యుకేషన్ మినిష్టర్

కరోనా కేసులు పూర్తి తగ్గుముఖం పట్టిన తరువాతే కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అంటే ఈ ఏడాది వరకు క్లాస్ జరగవని..కరోనా తగ్గిన తరువాత కాలేజీలు ప్రారంభం అవుతాయని తమిళనాడు హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కేపీ అన్బలగన్ స్పష్టం చేశారు. వైరస్ తగ్గకుండా కాలేజీలను ప్రారంభిస్తే విద్యార్ధుల ప్రాణాలకే ప్రమాదమని అన్నారు.

ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కరోనా వైరస్ నుంచి విద్యార్ధుల్ని రక్షించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో ఉన్న అన్నీ కాలేజీ క్యాంపస్ లను ఆరోగ్యశాఖకు అప్పగించినట్లు తెలిపారు.

క్యాంపస్ లను  పూర్తిస్థాయిలో క్రిమిసంహారక మందులతో పిచికారి చేసి వచ్చే ఏడాది ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది కాలేజీ ప్రారంభానికి ముందే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి కేపీ అన్బలగన్.

Latest Updates