కొలంబియాలో కొండచరియలు మీదపడి 20మంది మృతి

కొలంబియాలో వర్షాకాలం సీజన్ ఏజెన్సీ ప్రాంత వాసుల ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్రన్ కొలంబియాలోని రొసాస్ లో వాన- వరద కారణంగా రెండురోజుల కింద కొండచరియలు విరిగిపడ్డాయి. దిగువ ప్రాంతంలో నివసిస్తున్న పది ఇండ్లపై పెద్దపెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు పడ్డాయి. దీంతో… ఇండ్లన్నీ మట్టికింద కూరుకుపోయి ధ్వంసమయ్యాయి.

కొలంబియా రిస్క్ అండ్ డిజాస్టర్ ఏజెన్సీ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. సోమవారం నాటికి 17 మంది చనిపోయారని చెప్పిన అధికారులు… ఈ ఉదయం ఓ చిన్నారి సహా మూడు మృతదేహాలు వెలికితీశారు. తాజాగా మృతుల సంఖ్య 20కి పెరిగిందన్నారు. మరో పది మంది వరకు మట్టిదిబ్బల కింద ఉన్నట్టు అనుమానాలున్నాయని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.

Latest Updates