దొంగలనుకొని ముగ్గురు వ్యక్తులపై దాడి, ఒకరి మృతి

అర్థరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్నారని..  ముగ్గురు వ్యక్తులపై కాలనీవాసులు దొంగలుగా భావించి దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో అతని తాలూకు బంధువులు కాలనీలోని షాపులను ధ్వంసం చేశారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరగడం కాలనీవాసులుకి కనిపించింది. దీంతో ఆ వ్యక్తుల్ని దొంగలుగా భావించి కాలనీవాసులు వారిపై దాడి చేశారు. ఈ దాడిలో మెట్ పల్లికి చెందిన చిత్తూరి సుదర్శన్ అనే వ్యక్తి చనిపోగా..ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని హాస్పిటల్ తరలించారు. దాడి విషయం తెలుసుకున్న మెట్ పల్లివాసులు..కోరుట్ల ప్రకాశం రోడ్డులోని షాపులను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Colonists attacked three men  assumed as they are thieves, one dead

Latest Updates