వరద నీటి విషయంలో కొట్టుకున్న కాలనీ వాసులు

వరద నీటి విషయంలో కాలనీల మధ్య లొల్లి

కర్రలతో దాడి చేసిన్రు

ఎల్బీనగర్(హైదరాబాద్), వెలుగు: అతి భారీ వర్షాలకు హైదరాబాద్ ఆగమైంది. ఊరు నీరైంది. కాలనీల్లో ఎటు చూసినా వరదే. ఎటూ పోయే దారిలేక ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచి ఉంటున్నయ్. దీంతో ఎక్కడో ఒకచోట గండి కొట్టి దిగువకు నీటిని పంపేందుకు కొన్ని కాలనీల్లో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల దిగువ కాలనీల్లోకి నీరు చేరుతున్నాయి. ఇది గొడవలకు కారణమవుతోంది. వనస్థలిపురంలో ఇలానే మొదలైన వాగ్వాదం కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి వెళ్లింది.

వనస్థలిపురంలోని హరిహరపురం కాలనీని వరద ముంచెత్తింది. దీంతో ఆ కాలనీ వాసులు గురువారం అర్ధరాత్రి గుర్రంగూడ ఫారెస్ట్ వైపు నీటిని మళ్లించేందుకు జేసీబీతో పనులు చేపట్టారు. అదే సమయంలో అప్పటికే ముంపుకు గురైన స్నేహమయి నగర్ కాలనీ, గాంధీ నగర్ కాలనీ వాసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ గండి కొడితే ఆ వరదంతా తమ కాలనీల్లోకి వస్తుందంటూ పనులను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. హరిహరపురం కాలనీ వాసులు కర్రలతో దాడి చేయడంతో స్నేహమయి నగర్ కాలనీకి చెందిన సాయి గౌడ్, సందీప్ లకు గాయాలయ్యాయి. వారికి స్థానిక ఆస్పతిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో హరిహరపురం కాలనీకి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.

For More News..

గడ్డి కాల్చకుండా ఆపేందుకు స్పెషల్ కమిటీ

పంటలను మద్దతు ధరకే కొంటం.. మరోసారి స్పష్టం చేసిన మోడీ

బర్త్ డే పార్టీకి పిలిచి.. ఓయో రూంలో గ్యాంగ్ రేప్ చేసిండ్రు

Latest Updates