కరోనా ఎఫెక్ట్ ను బట్టి పీఎస్ లకు కలర్ కోడ్

హైదరాబాద్, వెలుగు కరోనా కంటైన్‌‌మెంట్ ఏరియాల్లో సిబ్బందిని  అలర్ట్ చేసేందుకు  హైదరాబాద్‌‌ పోలీసు కమిషనరేట్‌‌ డిజిటల్‌‌ మ్యాప్‌‌ను రూపొందించింది. పాజిటివ్‌‌ కేసుల తీవ్రతను బట్టి పోలీసుస్టేషన్ల పరిధిలోని ఆయా ఏరియాలకు కలర్‌‌ కోడ్‌‌ కేటాయించింది. 5 జోన్లలోని కంటైన్‌‌మెంట్లను పీఎస్‌‌ల వారీగా విభజించింది.   కరోనా కట్టడికి  హెల్త్, జీహెచ్ఎంసీ, పోలీసు డిపార్ట్‌‌మెంట్స్‌‌ తీవ్రంగా ఫైట్‌‌ చేస్తున్నాయి.  పాజిటివ్ కేసులు ఎక్కువగా  నమోదైన హాట్ స్పాట్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా ఆయా శాఖలు అలర్ట్‌‌గా ఉంటున్నాయి.

పోలీస్ స్టేషన్లకు 7 కలర్స్‌‌ కోడ్‌‌

20 నుంచి 50  కేసులు నమోదైన స్టేషన్ లోని ప్రాంతం డార్క్ రెడ్ , 15 నుంచి 30  కేసులున్న ఏరియా స్టేషన్ కు లైట్ రెడ్ కలర్‌‌ కోడ్‌‌ ఇచ్చారు. 1 నుంచి 20 వరకు కేసులున్న  ప్రాంతాల్లో తీవ్రతను బట్టి  డార్క్ బ్రౌన్ , లైట్ బ్రౌన్, డార్క్  లెమన్ ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో కలర్‌‌ కోడ్‌‌ కేటాయించారు. ఎలాంటి కేసులు లేని ఏరియాకు గ్రీన్ కలర్ కోడ్ ఇచ్చారు. ఇలా మొత్తం 7 కలర్స్ కోడ్‌‌తో ఏర్పాటైన డిజిటల్ మ్యాప్ ను పోలీస్ మొబైల్ యాప్స్ తో పాటు టీఎస్ కాప్ యాప్ లో అందుబాటులో ఉంచారు. ఈ మ్యాప్ ద్వారా  స్థానిక పీఎస్ ల పరిధిలో నమోదైన కరోనా కేసుల తీవ్రతను గుర్తించేలా సిబ్బందిని అలర్ట్ చేశారు.

డార్క్ రెడ్ పై ఫోకస్

హైదరాబాద్‌‌ కమిషనరేట్ పరిధిలో 8 పీఎస్ లు డార్క్ రెడ్ జోన్‌‌లో ఉన్నాయి.  ఆయా పీఎస్ ల  పరిధిలో లాక్ డౌన్‌‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. చెక్ పోస్టులతో పాటు కంటైన్ మెంట్ల పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. సమీప బస్తీలు, నిత్యావసరాల మార్కెట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు.  ఇలాంటి ఏరియాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి గతవారం పర్యటించారు.  హైదరాబాద్‌‌ సీపీ అంజనీకుమార్ ఆయా ఏరియాలపై స్పెషల్ గా ఫోకస్ చేసి డీసీపీలతో ప్రతిరోజు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు.

14 పీఎస్‌‌లకు గ్రీన్ కలర్

కమిషరేట్‌‌ పరిధిలోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్  కేసు కూడా నమోదు కాలేదు. ఇలాంటి ఏరియాలకు గ్రీన్ కలర్ కోడ్‌‌ సూచించారు. మరో 9  పీఎస్ లిమిట్స్ లో 1 నుంచి 2 కేసులు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. ఆయా కంటైన్ మెంట్లలో బందోబస్తు పటిష్ఠంగా నిర్వహిం చేందుకు డిజిటల్ మ్యాపింగ్ సహకరిస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.

 

Latest Updates