మన బ్రహ్మానందమే.. కొత్త సినిమా కోసం డిఫ్రంట్ గెటప్

తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య బ్రహ్మగా పేరొందిన కమెడియన్ బ్రహ్మానందం రానున్న తన కొత్త సినిమాలో డిఫ్రంట్ లుక్ తో అలరించనున్నాడు. కేవలం లుక్ మాత్రమే కాదు, ఆయన పాత్ర ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ఉంటుందని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అంటున్నారు. తాజాగా ఆయన తీస్తున్న రంగమార్తాండ చిత్రంలో మన బ్రహ్మీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ అనే చిత్రానికి  ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ నటిస్తున్నారు.

ఈ సినిమాలో బ్రహ్మానందం లుక్ ను సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసిన కృష్ణవంశీ.. రంగమార్తాండ సినిమాలో  బ్రహ్మానందం పాత్ర మనసులు కదిలించే విధంగా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు.

brahmanandam Different look in Krishna Vamsi new movie Rangamarthanda

Latest Updates