రేపు జార్జి ఫెర్నాండెజ్ సంస్మరణ దినోత్సవం

కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ సేవలకు గుర్తుగా రేపు ఆయన సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి చెప్పారు. రేపు మద్యాహ్నాం మూడు గంటలకు రవీంద్ర భారతీలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఫెర్నాండెజ్ ముందుంటారని  అన్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ఫెర్నాండెజ్ దేశానికి ఎంతో సేవ చేశారని  గుర్తు చేశారు నాయిని.

Latest Updates