ఈనెల 17 వరకూ కమర్షియల్​ ప్లేన్లు బంద్

న్యూఢిల్లీ: దేశంలో లాక్​డౌన్​ను ఈనెల17 వరకూ పొడిగించడంతో అప్పటి వరకూ కమర్షియల్​ పాసింజర్ విమాన సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్టు డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్ సివిల్​ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. మే 17 అర్ధరాత్రి వరకూ సర్వీసులను సస్పెండ్​ చేస్తున్నట్టు శనివారం ఒక సర్క్యూలర్​లో వెల్లడించింది.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్​ సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా మార్చి 25 నుంచి కమర్షియల్​ విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. కార్గో సర్వీసులు, మెడికల్​ ఎమర్జెన్సీ సర్వీసులు, స్పెషల్​ ఫ్లైట్లను మాత్రమే డీజీసీఏ అనుమతిస్తోంది.

Latest Updates