దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం: IMD

భారత వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు అందించింది. 2019 సంవత్సరానికి సంబంధించి వర్షపాతం అంచనాలను ప్రకటించింది. ఈ నైరుతి రుతుపవన కాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు IMD కార్యదర్శి మాధవన్ నాయర్ రాజీవన్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96శాతం వర్షపాతం రికార్డ్ అవుతుందన్నారు. దీనికి 5శాతం అటు ఇటుగా ఉండొచ్చన్నారు. ఎల్ నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయని… పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ నైరుతి రుతుపవన కాలం రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

వాతావరణానికి సంబంధించి అత్యంత ప్రమాదకరంగా భావించే ఎల్ నినో ప్రభావం బలహీనపడిందని నాయర్ తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై భూమధ్య రేఖ వెంబడి ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ.. అది బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. దీని ప్రభావం జూన్, జులై నెలల్లో కురిసే వర్షాలపై ఉంటుందని అన్నారు.

దేశంలో సకాలంలో ఈశన్య, నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని అన్నారు. వాటి కదలిక చురుగ్గా ఉంటుందని చెప్పారు మాధవన్ నాయర్.

Latest Updates