ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఏం చేయలేదు: జీ జిన్ పింగ్

  • చైనాలో 70 ఏళ్ల కమ్యూనిజం వేడుకల్లో ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌

బీజింగ్‌‌‌‌‌‌‌‌:  ప్రపంచంలోని ఏశక్తీ తమ దేశాన్ని   కదిలించలేదని చైనా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జీ జిన్‌‌పింగ్ ప్రకటించారు.  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ విషయంలో   ‘‘ఒక దేశం.. రెండు విధానాలను’’ చైనా కొనసాగిస్తుందని చెప్పారు. దేశం కమ్యూనిస్టు పార్టీ పాలన కిందకు వచ్చి 70 ఏళ్లు  అవుతున్న సందర్భంగా మంగళవారం ఇక్కడ జరిగిన వేడుకల్లో చైనా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. సుమారు 1500 మిలటరీ ట్రూప్స్‌‌‌‌‌‌‌‌  పరేడ్‌‌‌‌‌‌‌‌ లో పాల్గొన్నాయి. ట్యాంకులు, కొత్త నూక్లియర్‌‌‌‌‌‌‌‌ మిస్సైల్స్‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌ సోనిక్‌‌‌‌‌‌‌‌ డ్రోన్‌‌‌‌‌‌‌‌ను ఈ పెరేడ్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శించారు.    పేద దేశం నుంచి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎలా ఎదిగిందో  ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో  చూపించారు. ‘‘మావో సూట్‌‌‌‌‌‌‌‌’’లో   చైనా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌  స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఎట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు.  సుమారు లక్షమంది ఈ  ప్రదర్శనను చూశారు. జిన్‌‌పింగ్‌‌‌‌‌‌‌‌తోపాటు కమ్యూనిస్టు పార్టీ లీడర్లు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు..  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి.  పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

Latest Updates