నన్ను ఇందిరా గాంధీజీతో పోల్చవద్దు : ప్రియాంక గాంధీ

కేరళ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ… కేరళ వయనాడ్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం మనంతవాడీ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక..ఐదేళ్ల క్రితం ప్రజల మద్దతుతో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం… ఇన్నేళ్ల పాలనలో జనం నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే BJP ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని.. ప్రచార ఆర్భాటాలకే బీజేపీ నాయకులు పరిమితమవుతున్నారన్నారు. కాన్పూర్‌ ను స్మార్ట్‌ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చిన బీసేపీ.. నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదన్నారు. ‘వన్ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ సైనికుల హక్కు అని.. దాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం విచారకరమన్నారు ప్రియాంక.

తనని మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చవద్దని ప్రియాంక గాంధీ అన్నారు. దేశానికి సేవ చేయడంలో మాత్రం ఆమె అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తామన్నారు. దేశసేవ పట్ల ఆమె గుండెల్లో ఉన్న అంకితభావమే నాతో పాటు తన బ్రదర్ రాహుల్ గాంధీ హృదయంలోనూ ఉందన్నాడు. మా నుంచి దాన్ని ఎవరూ దూరం చేయలేరని.. మీకు సేవ చేస్తూనే ఉంటామన్నారు ప్రియాంక గాంధీ.

 

Latest Updates