న‌ష్ట‌పోయిన రైతుల‌కు డిసెంబర్ 31వ తేదీ లోపు పరిహారం

అమరావతి: ‘నివర్‌ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నాయని, డిసెంబరు 15వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించామ‌ని’ ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ లోపుగా పరిహారం అందిస్తామని ఆయ‌న హామీ ఇచ్చారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో పంట నష్టంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. వర్షాల కారణంగా రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన ప్రకటించారు.నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.పంట నష్టాన్ని నిజాయితీగా సమీక్షించామని ఆయన వివరించారు. అక్టోబర్, నవంబర్ లో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించినట్టుగా సీఎం చెప్పారు.తుఫాన్ తో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకొంటామని చెప్పారు.50 లక్షల మంది రైతులకు రైతు భరోసాను అందిస్తామన్నారు.వైఎస్ఆర్ జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.50 లక్షల మంది రైతులకు రైతు భరోసాను అమలు చేస్తున్నామన్నారు.

Latest Updates